calender_icon.png 9 December, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు హక్కు గురించే మాట్లాడుతున్నా

09-12-2025 05:08:10 PM

న్యూఢిల్లీ: లోక్‌సభలో వందేమాతరం చర్చను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన తర్వాతి రోజు ప్రతిపక్షాలు మంగళవారం దిగువ సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చను ప్రారంభించాయి. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నుండి ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR)పై సభలో మాట్లాడారు. హెచ్ఏఎల్, బీహెచ్ఈఎల్, ఓఎన్‌జీసీ వంటీ ఏర్పాటుపై చర్చిద్దామని రాహుల్ గాంధీ సూచించారు. ఆర్ఎస్ఎస్ వాదులకు సమానత్వంపై నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహాత్మగాంధీని నాథూరాం గాడ్సే కాల్చి చంపారని, సమానత్వ భారతం కోసం తప్పించిన జాతిపితను హత్య చేశారు. దేశంలోని వ్యవస్థలన్నింటిపైనా ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం చూపుతోందన్నారు. ఆర్ఎస్ఎస్ కు నచ్చని నిజాలన్నింటిని ప్రజలకు దూరం చేస్తున్నారని, దేశంలోని వ్యవస్థలన్నింటిని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారని, దేశంలోని వైవిధ్యాన్ని ఆర్ఎస్ఎస్ నాశనం చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో లోక్‌సభలో మరోసారి గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. రాహుల్ గాందీ ప్రసంగాన్ని భారతీయ జనతా పార్టీ ఎంపీలు అడ్డుకున్నారు.

తను సభలో ఓటు హక్కు గురించే మాట్లాడుతున్నంటూ రాహుల్ సమాధానం ఇచ్చారు. కేంద్రంలోని అధికార పార్టీ నాయకులు ఏకంగా దేశ ఎన్నికల కమిషన్ ను, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కబ్జా చేశారని, ఎన్నికల వ్యవస్థను కలుషితం చేసి తీవ్ర నష్టం చేశారని మండిపడ్డారు. దేశంలోని వర్శిటీలను ఇప్పటికే కబ్జా చేశారని, వర్శిటీలకు సంబంధించిన విసీలంతా ఆర్ఎస్ఎస్ వాదులే అని విరుచుకుపడ్డారు. ఓట్ల చోరీకి సంబంధించి తామ వద్ద ఆధారాలు ఉన్నాయని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ఈసీని బీజేపీ వాడుకుంటోందని ఆయన అన్నారు. పథకం ప్రకారమే ఈసీ ఎంపిక ప్యానల్ నుంచి సీజేఐని తొలగించారని, ఎన్నికల సంఘాన్ని పరోక్షంగా నియంత్రిస్తున్నారు.

హరియాణా ఓటర్ల జాబితాలో బ్రెజిల్ మోడల్ పేరుతో 23 ఓట్లు ఉన్నాయని, మోడల్ పేరుతో ఉన్న ఓట్లను, ఉత్తర్ ప్రదేశ్ లో లక్షల సంఖ్యలో ఉన్న డూప్లికేట్ ఓట్లను గుర్తించి ప్రశ్నిస్తే ఈసీ నుంచి ఎలాంటి సమాధానం లేదని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. బీహార్ లో ఎస్ఐఆర్ తర్వాత కూడా 1.2 లక్షల డూప్లికేట్ ఉన్నాయని, బీజేపీ గెలిచిన అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలోని అవకతవకలను బయటపెట్టామని రాహుల్ గాంధీ తెలిపారు.