09-12-2025 12:00:00 AM
శామీర్‌పేట్ , డిసెంబర్ 8: మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేశవరం గ్రామానికి చెందిన గుడిసె స్వప్న నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని సోమవారం రోజున గృహ ప్రవేశ కార్యక్రమం చేశారు. కాగా మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహ యాదవ్, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకా యల వెంకటేశు లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పేదల సొంత ఇంటి కల నిజం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయ కులు బండి జగన్నాథం , మూడు చింతలపల్లి మాజీ ఉపసర్పంచ్ వెంకటరమణారెడ్డి, గుర్రం బసవ రెడ్డి, లక్ష్మణ్, మహేష్, శేఖర్, మల్లేష్, బాలకృష్ణ, యుసుఫ్, జయలపాండు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.