calender_icon.png 9 December, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు

09-12-2025 12:00:00 AM

వికారాబాద్, డిసెంబర్- 8: స్కానింగ్ ద్వారా లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ స్వర్ణకుమారి తెలిపారు. సోమవారం వికారాబాద్ లోని హృదయ హాస్పిటల్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  డాక్టర్ స్వర్ణ కుమారి  ఆకస్మికంగా సందర్శించి స్కానింగ్ సెంటర్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కానింగ్ సెంటర్‌లో  రికార్డులను, ఆన్లైన్ నమోదు వివరాలను, స్కానింగ్ చేస్తున్న డాక్టర్ యొక్క అర్హత సర్టిఫికెట్లను పరిశీలించారు. 

గర్భస్థ పిండా లింగ నిర్ధారణ పరీక్షల చట్టం ప్రకారం పరీక్షలు చేసే ప్రతి రేడియాలజిస్టు లేదా గైనకాలజిస్ట్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

జిల్లా పరిధిలోని అన్ని ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు, లాబరేటరీలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే నిర్వ హించాలని లేనియెడల పి సి పి ఎన్ డి టి మరియు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకా రం జరిమానా, సీజ్  లేదా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.