19-01-2026 09:12:14 PM
పదేళ్లు పాలించిన టిఆర్ఎస్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మిగిల్చింది
ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కేంద్రంలో మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యం అని ఎమ్మెల్యే రామచందర్ నాయక్ అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం ఆడిటోరియంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇందిర మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
చీరల పంపిణీ వడ్డీ లేని రుణాలు సబ్సిడీ పంపిణీ కార్యక్రమం అనంతరం డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని మహిళ సాధికారత కోసం మహిళలకు ఉచిత బస్సు, వడ్డీ లేని రుణాలు, మహిళ శక్తి క్యాంటీన్ లాంటివి పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. మహిళా సంఘాలకు 6,12,230 లక్షల రూపాయల చెక్కును మహిళా మణులకు అందించారు.