13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి

19-01-2026 09:15 PM

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

109 దరఖాస్తుల రాక

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. మొత్తం దరఖాస్తులు 109 వచ్చాయి.ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులకు అందించి, నిర్ణిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

పరిహారం చెక్కు అందించిన ఇంచార్జి కలెక్టర్

సెర్ప్ లో సీసీ గా విధులు నిర్వర్తిస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబానికి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిహారం చెక్కును అందజేశారు. ఇల్లంతకుంట మండలంలో సెర్ప్ లో సీసీ సదయ్య మరణించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంచార్జి కలెక్టర్  స్త్రీనిధి ద్వారా రూ. లక్ష 50 వేల  పరిహారం చెక్కును సదయ్య భార్య మంద సరళ కు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు.కార్యక్రమంలో గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీఆర్డీఓ గీత, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, స్త్రీనిధి ఆర్ఎం భూ కైలాస్ తదితరులు పాల్గొన్నారు.