18 March, 2026 | 12:20 PM

Breaking News

మూసీ ప్రాజెక్ట్ మొదటి దశ డీపీఆర్ తయారైంది: మంత్రి శ్రీధర్ బాబు   •   మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •  

పేదల అభ్యున్నతికి ఇందిర కృషి

31-10-2024 01:00 AM

ఇందిరాగాంధీ, వల్లభాయ్ పటేల్‌కు సీఎం రేవంత్ నివాళి

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రాజభరణాల రద్దు, బ్యాం కుల జాతీయీకరణ, 20 సూత్రాలు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతికి, పేదల అభ్యున్నతికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తన ప్రతి రక్తపు బొట్టు దేశ పటిష్టతకు తోడ్పడుతుంది అని ప్రకటించిన మహనీయురాలు ఇందిరాగాంధీ అని  కొనియాడా రు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె సేవలను స్మరించుకున్నారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసినప్పటికీ దేశ సమగ్రత, సమైకత్య, పటిష్టతకు కఠిన నిర్ణయాలు తీసుకొని ఆమె ముందు కు సాగారని తెలిపారు. తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ పాలన ను ఆదర్శంగా తీసుకుందని ఆ మహనీయురాలి స్ఫూర్తితోనే పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని చేపడుతున్నామని  తెలిపారు.

పటేల్ ఆశయ సాధనకు కృషి..

సంస్థానాల విలీనం ద్వారా స్వతంత్య్ర భారతదేశ సార్వభౌమత్వానికి నిండుదనాన్ని చేకూర్చిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని సీఎం రేవం త్ రెడ్డి కొనియాడారు. పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకున్నారు. భారత ప్రథమ ఉప ప్రధానమంత్రిగా, హోం శాఖ మంత్రి గా ఆయన చూపిన చొరవ, సమర్ధతతోనే వందలాది సంస్థానాలు దేశంలో విలీనమయ్యాయని తెలిపారు. పటేల్ ఆశయ సాధనకు కృషి చేయాలని  పిలుపునిచ్చారు.