21-02-2026 02:00:36 AM
శోకసంద్రంగా మారిన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదర్‌పల్లి గ్రామం
హన్వాడ, ఫిబ్రవరి 20: కొడుకు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే తట్టుకోలేక తల్లి కూడా గుండెపోటుతో మృతిచెందింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదర్‌పల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. పెద్దదర్‌పల్లి గ్రామానికి చెందిన దెబ్బడి బాలమ్మ (౮౦)కు కొడుకు దెబ్బడి కృష్ణయ్య (౪౦) ఉన్నాడు. దెబ్బడి కృష్ణయ్య కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
కొన్ని కారణా ల వల్ల గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున కుటుంబసభ్యులు గమనించి చూడగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించుకున్నారు. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి దెబ్బడి బాలమ్మ(80) గుండెలో నొప్పి వస్తుందం టూ కుటుంబసభ్యులకు చెప్పగా హుటాహుటిన మహబూ బ్‌నగర్ జనరల్ హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడు దెబ్బడి కృష్ణ య్యకు భార్య లక్ష్మి, కుమారుడు చంటి, కూ తురు స్వేచ్ఛ ఉన్నారు. కొడుకు, తల్లి గంటల వ్యవధిలోనే మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుపుకున్నాయి.