13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మంత్రి అడ్లూరి చొరవతో ఇందిరమ్మ కాలనీకి ‘విద్యుత్’ వెలుగులు

23-03-2026 12:40 AM
  1. ఒకే రోజులో స్తంభాల ఏర్పాటు, బల్బుల బిగింపు

ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

ధర్మపురి,మార్చి22 (విజయక్రాంతి): వెల్గటూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మితమవుతున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విద్యుత్ కష్టాలకు తెరపడింది. కాలనీ వాసుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ చూపడంతో,అధికారులు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పనులను పూర్తి చేశారు.మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ అధికారులు, ఒకే రోజులో కాలనీకి అవసరమైన విద్యుత్ స్తంభాలను(5) ఏర్పాటు చేసి, లైన్లను లాగి విద్యుత్ బల్బులను కూడా అమర్చారు.

ఈ పనులను ఉపసర్పంచ్ గండ్ర ప్రతాప్ రావు కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు.ఒకే రోజులో అంధకారం తొలగి, కాలనీ వీధులు వెలుగులతో నిండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సమస్యను తక్షణమే పరిష్కరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మరియు పనులను పర్యవేక్షించిన ఉపసర్పంచ్ ప్రతాప్ రావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్,వార్డ్ సభ్యులు గుండాటి సందీప్ రెడ్డి,నక్క సురేష్, బీసీ సెల్ అధ్యక్షుడు బందెల ఉదయ్ గౌడ్,యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ గండ్ర శ్రీకాంత్ రావు,పెద్దూరి భరత్ కుమార్,వెలగందుల సంతోష్,కొండ లక్ష్మీనారాయణ,పందిరి వెంకటేష్,మెరుగు ప్రవీణ్,గుమ్ముల తిరుమలేష్,పరంకుశం సాయి,రంగు మహేశ్,కాలనీ వాసులు పాల్గొన్నారు.