24 August, 2026 | 11:21 AM

Breaking News

అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు

25-06-2025 04:48 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ రాజేశ్వర్(Mandal Parishad Development Officer Rajeshwar) స్పష్టం చేశారు. మండలంలోని మామిడిగట్టు గ్రామంలో బుధవారం లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాలలో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపిటిసి దుర్గం కుమారస్వామి, మాజీ సర్పంచ్ సుంకరి నంబయ్య, హౌసింగ్ ఏఈ జోష్నా, కార్యదర్శి సంధ్యారాణి, కాంగ్రెస్ నాయకులు రేగుంట పాల్గొన్నారు.