14 April, 2026 | 9:05 PM

అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల

25-06-2025 04:51 PM

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్లగొండ పట్టణం మాన్యం చెల్క 24వ వార్డు అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాసరి వెంకన్న గుండెపోటుతో మరణించడంతో బుధవారం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Former MLA Kancharla Bhupal Reddy) అంత్యక్రియలలో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దాసరి వెంకన్న  నిజాయితీగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి అని తనతో మొదటి నుంచి రాజకీయాల్లో కలిసి పనిచేసిన నాయకుడు అన్నాడు. ఆయన మరణం తనకు తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ధైర్యవచనాలు చెప్పి అన్ని రకాలుగా కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. అంత్యక్రియల్లో పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, మాతంగి అమర్, కల్లెపురం రమేష్,కల్లెపురం యాదయ్య, కత్తుల కిషోర్,జగన్ ఝాన్సీ, కత్తుల సంధ్య తదితరులు వెంట ఉన్నారు.