ధర్మారంలో నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇల్లు
మంత్రి శ్రీధర్ బాబు చొరవతో నిర్మాణ పనులు ప్రారంభం
మంథని,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ఆదేశాల మేరకు మంథని మండలంలో నిరుపేదలకు అండగా నిలిచే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మండలంలోని (ధర్మారం) గద్దలపల్లి గ్రామానికి చెందిన నిరుపేద మహిళ రేగళ్ల సమ్మక్క కు ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో భాగంగా ఇల్లు మంజూరైంది. అయితే, సదరు మహిళ ఇంటిని నిర్మించుకునే ఆర్థిక స్థితిలో లేకపోవడంతో స్థానిక నాయకులు చొరవ తీసుకున్నారు.
అడవిసోమాన్ పల్లి మాజీ సర్పంచ్ కోటారి బాపన్న, సడ్వాలన్న, మాజీ ఎంపీటీసీ మండేపు మదన్న తో చర్చించి, ఆ నిరుపేద మహిళకు ఎలాగైనా ఇల్లు నిర్మించి ఇవ్వాలని గ్రామ నాయకులు కోరారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించి పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. శుక్రవారం గద్దలపల్లి గ్రామంలో క్షేత్రస్థాయిలో ఇంటి స్థలానికి ముగ్గు పోసి, నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. నిరుపేద మహిళకు గూడు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన మంత్రి శ్రీధర్ బాబు కు, శ్రీనుబాబు కు సహకరించిన నాయకులకు కాంగ్రెస్ నాయకులు అక్కపాక సమత - సదయ్య గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.






