15 May, 2026 | 4:37 PM

SIRను హడావిడిగా చేయాల్సిన అవసరం లేదు: మహేశ్ గౌడ్

15-05-2026 03:31 PM

బెంగాల్ ఎన్నికలే నిదర్శనం

ఎస్ఐఆర్ ప్రక్రియపై మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) నేతృత్వంలో అయిన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(State Chief Electoral Officer) సి. సుదర్శన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ భేటీలో మంత్రి పొన్నం ప్రభాకర్,రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ,ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ,ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,నవీన్ యాదవ్, శ్రీ గణేష్ , కార్పొరేషన్ చైర్మన్ లు ,ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. SIR ప్రక్రియ చాలా పారదర్శకంగా జరపాలని  కాంగ్రెస్ నేతల  ఎన్నికల అధికారికి వినతి పత్రం అందజేశారు.

సీఈఓ సుదర్శన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఎస్ఐఆర్(Special Intensive Revision) వల్లే బెంగాల్ లో రాజకీయ సమీకరణాలు మారాయి, ఎస్ఐఆర్ వల్లే బెంగాల్ లో గెలవాల్సిన పార్టీలు ఓడిపోయాయని  మహేశ్ గౌడ్ అన్నారు. తెలంగాణలో వచ్చే రెండేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేవని ఆయన వెల్లడించారు. ఎస్ఐఆర్ ను హడావిడిగా చేయాల్సిన అవసరం లేదని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు.

ఎస్ఐఆర్ ప్రక్రియను(SIR Process) ఏడాదిన్నర పాటు జాగ్రత్తగా చేయాలని ఆయన కోరారు. జనగణన ప్రక్రియ ఇప్పటికే జరుగుతుందన్న మహేశ్ గౌడ్ జనగణనతో పాటే ఎస్ఐఆర్ నిర్వహిస్తే సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుందని సూచించారు. ఎస్ఐఆర్ లో ఓటు తొలగిస్తే దరఖాస్తు చేసుకునే గడువు 3 నెలలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. పత్యక్షంగా మూడు, నాలుగు సార్లు బీఎల్ వో ఇంటికి వెళ్లి ఓటు తనిఖీ చేయాలన్నారు. 14 రాష్ట్రాల్లో SIR ఓట్ల చోరీ జరిగిందని మహేశ్ గౌడ్ ఆరోపించారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీల్లో సగం మందిని దొంగ ఓట్లతోనే గెలిచారని పేర్కొన్నారు.