11 April, 2026 | 5:46 PM

Breaking News

అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇండ్లు

11-04-2026 04:10 PM

డిసిసి ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్

ఘట్ కేసర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ప్రజా పాలనలో అర్హులైన  ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లను అందించడం జరుగుతుందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని ఘనపురం  ఫకీర్ టేక్య తండాలో వడ్త్యా మంజుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి మహేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. పేదల కళ్ళలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తూ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందించడం జరుగుతుందన్నారు.