06-12-2024 02:33:37 AM
పేదల కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం : డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే కార్య క్రమాన్ని ప్రారంభించుకోవడం సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున 4.50 లక్షల ఇళ్లకు రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా తాను ఎన్నికల ముందు రాష్ట్రంలో పాదయాత్ర, సభలు నిర్వహించినప్పుడు వేలాదిమంది తమ సమస్యలతో పాటు ఉండటానికి ఇళ్లు లేదని చెప్పారని పేర్కొన్నారు. ఎంతటి నిధుల భారం అయినప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం చేపడుతున్న ట్టు తెలిపారు. కొద్దిమంది వ్యక్తు లు మా ప్రభుత్వంపై కావాలని బురద చల్లే కార్యక్రమం చేపట్టారని వారి మాదిరిగానే మా ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారని ఆరోపించారు.