06-12-2024 02:27:14 AM
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, ఎంత గీ పెట్టినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని ప ర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, అవినీతి పాలనతో ప్రజల స్వే చ్ఛను హరించారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం, ప్రజల ఆ కాంక్షల మేరకు నడుచుకుంటుందని తెలిపారు. గాంధీభవన్‌లో గురువారం నిర్వహించిన మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమంలో మంత్రి జూప ల్లి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, హరిప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని, ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించాక ప్రజలకు, పార్టీ కార్యకర్తకలకు వారంలో ఒక రోజు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం మంచి సంప్రదాయానికి నాంది పలికిందన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్టు విష యంపై స్పందిస్తూ చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు మం దలించాలని, కానీ కేసీఆర్ ఫా మ్‌హౌస్‌కు పరిమితమై కొడు కు, అల్లుడిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. బీఆర్‌ఎస్ పాలకుల మాదిరిగా తమ ప్రభుత్వం నిరంకు శంగా వ్యహరించడం లేదని, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు.
ముఖాముఖిలో 103 దరఖాస్తులు..
ముఖాముఖి కార్యక్రమానికి వివిధ సమస్యలపై ప్రజలు, పార్టీ కార్యకర్తలు మంత్రి జూపల్లికి 103 దరఖాస్తుల వరకు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఫించన్లు, రెవెన్యూ తదితర సమస్యలపై ప్రజలు దరఖాస్తులు అందజేశారు. హైదరాబాద్ కలెక్టర్‌కు మంత్రి ఫోన్ చేసి కొన్ని సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.