21 April, 2026 | 5:41 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: ఎమ్మెల్యే కోరం

02-07-2025 12:54 AM

ఇల్లందు మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ 

ఇల్లెందు, జూలై 1 (విజయక్రాంతి):అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కోరం కనకయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఇల్లందు మండలంలోని మ ర్రిగూడెం, పోలారం, పోచారం, బోయితండా, మాణిక్యారం, ముత్తారపుకట్టా, మసివాగు, మొండితోగు గ్రామపంచాయతీలలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. ఇప్పటికే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామన్నారు.

రూ.500 కే గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ, రైతు భరోసా కార్యక్రమాలతో ప్రజలకు భరోసా ఇస్తున్నామని తెలిపారు. ఈ విధంగా పేద ప్రజలకు అనేక కార్యక్రమాలను అందిస్తున్న ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని రానున్న కాలంలో ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం కొమరారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.

మాణిక్యారం గ్రామపంచాయతీలో హై స్కూల్ ఏర్పాటు కోసం గ్రామస్తులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాంబాబు, నాయకులు పులి సైదులు, మండల రాము, పూనెం సురేందర్, కిన్నెర నరసయ్య, తాటి బిక్షం, పులిగండ్ల మాధవరావు, మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, సదానందం తదితరులు ఉన్నారు.