24 August, 2026 | 11:44 AM

Breaking News

అమెరికాలో దమ్మాయీగూడ యువకుడి విషాదాంతం   •   కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •  

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలకు ఆకారం

16-06-2025 10:20 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్ లష్కర్ సింగారంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) హాజరయ్యారు. అర్హులైన లబ్దిదారుల ఇళ్లకు పూజ కార్యక్రమం చేసి, పనులను ప్రారంభించారు. నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్థితిగతులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నాయిని, ఎన్నో ఏళ్లుగా అద్దె గృహాల్లో ఉంటున్న మాకు సొంతిల్లు కల సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపి తమ కృతజ్ఞత చాటుకోన్నారు లబ్ధిదారులు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు పట్టించుకోని పేదలకు న్యాయం చేయడం మా లక్ష్యమని, ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి సొంత ఇంటి కల సాకారం కావాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం అని అన్నారు. 53 వ డివిజన్  పేదలు అధికంగా ఉన్నారని కేటించిన వాటికంటే అధిక ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేశారని తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బాబాయ్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు  అజీజ్, రహీమున్నీసా, కాంగ్రెస్ నాయకులు ఎర్ర మహేందర్, మట్టెడ అనిల్ కుమార్, శ్యామ్, రేణికుంట ప్రవీణ్, సత్తార్, కాసిం, ఎర్ర చందు, రజిత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.