2 July, 2026 | 12:22 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు

07-06-2025 12:00 AM
  1. పేదలున్న చోటే జీ-3 పద్ధతిలో నిర్మాణం
  2. గిరిజనులకు ప్రత్యేకంగా 22 వేల ఇండ్లు
  3. రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి స్పష్టం

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్‌తో పాటు వరంగల్, నిజామాబాద్, మహ బూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్ తదితర పట్టణాల్లో పేదలుండే మురికి వాడల్లోనే జీ-3 విధా నంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

తొలివిడతలో భాగంగా హైదరాబాద్‌లో 16 మురికి వాడలను గుర్తించామని, మిగ తా పట్టణాల్లోనూ ఇదే విధానాన్ని అమలుచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పేదోడి సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ గ్రామీణ ప్రాంతాల్లో కొలి క్కి తీసుకొచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోనూ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామన్నారు.

శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భం గా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పట్టణాల్లోని మురికివాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు, అక్కడే ఉండటానికి ఇష్టపడుతున్నారని, ప్రధానంగా హైదరాబాద్‌కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు.

హైదరాబాద్‌కు దూరంగా   గతం లో 42 వేల ఇండ్లను నిర్మించగా, 19 వేల మం ది మాత్రమే అక్కడికి వెళ్లారని చెప్పారు. ఇటీవల క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించగా కేవ లం 13 వేల మంది మాత్రమే ఆయా నివాసాల్లో ఉంటున్నట్టు తేలిందన్నారు. ఈ అంశాల న్నింటినీ పరిగణనలోకి తీసుకొని పట్టణ ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పా రు.

సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం, మున్ననూరు నాలుగు  ఐటీడీఏ పరిధిలోని చెంచు, కోలాం, తోటి, కొండారెడ్లకు 13,266 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, అలాగే  రాష్ర్టంలోని 16 ఎస్టీ నియోజకవర్గాలకు ఇప్పటికే 8,750 ఇండ్లు మంజూరు చేశామని, దీనితో కలిపి గిరిజనులకు ఇంత వరకు 22,016 ఇందిరమ్మ ఇండ్లు మంజూ రు చేసినట్టు మంత్రి తెలిపారు.

ఈ ఇండ్లకు తక్షణమే లబ్ధిదారులను గుర్తించి, ఇండ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇండ్ల నిర్మాణం జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.