28 August, 2026 | 4:19 PM

19 వేల ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు తిరస్కరణ

28-08-2026 03:16 PM

హైదరాబాద్: క్యూర్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, రాజేంద్ర నగర్, నాంపల్లి నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్లలో ఫ్లాట్లకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని లక్కీడ్రాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పాల్గొన్నారు. మొదటి దఫాలో 7,340 ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో 4 రోజులపాటు లక్కీ డ్రా తీయనున్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 60 వేల దరఖాస్తులు రాగా, 19 వేల ఇళ్ల దరఖాస్తులను తిరస్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు.  ఇళ్లు దక్కని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని హౌసింగ్ బోర్డు వీసీ గౌతమ్ ప్రకటించారు.