07-08-2025 07:41:38 PM
రైల్వే మంత్రికి ఎంపీ విజ్ఞప్తి..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం రైల్వే స్టేషన్ లో కరోనా సమయంలో తొలగించిన రైళ్ల హాల్టింగ్ తిరిగి పునరుద్ధరించాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్(Railway Minister Ravneet Singh)ను ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కేసముద్రం రైల్వే స్టేషన్లో మణుగూరు, లింక్, మచిలీపట్నం, కరీంనగర్- తిరుపతి, బీదర్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని, అలాగే ఒకవైపు హాల్టింగ్ ఉన్న పద్మావతి, సాయి నగర్ షిరిడి ఎక్స్ప్రెస్ రైళ్లకు ఎగువ మార్గంలో కూడా ఆల్టింగ్ కల్పించాలని, నాగర్సోల్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలని కోరారు. ఎంపీ వెంట కే సముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు ఉన్నారు.