అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు
ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, జూలై 31 (విజయక్రాంతి): అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు అందేవిధం గా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం నిధులతో ఇల్లు లేనటువంటి పేదవారందరికీ ఇల్లు అం దజేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నామన్నారు.
గురువారం జైనథ్ మండలంలోని జైనథ్, బెల్గాం, గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందజేసి, నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వ ఫలాలు అర్హులైన పేదవారికి మాత్రమే అందాలన్నారు. లబ్ధిదారులు ఎవరు కూడా మధ్యవ ర్తులను నమ్మవద్దని సూచించారు. తక్కువ ధర కే సిమెంట్ లభించే విధంగా కంపెనీలతో మా ట్లాడుతానని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, బీజేపీ నాయకులు కరుణాకర్ రెడ్డి, రాందాస్, రాకేష్ రెడ్డి, విజయ్, అశోక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.






