01-08-2025 12:58:14 AM
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
జనగామ, జూలై 31 (విజయ క్రాంతి): స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో మల్లిఖార్జున పెయింట్స్ హార్డ్ వేర్ , ఫ్లై వుడ్ , షాప్ ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, కొమ్మూరి ప్రతాపరెడ్డి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు, స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. స్థానిక వనరులతో స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.