01-08-2025 01:00:39 AM
కాగజ్‌నగర్, జూలై ౩1 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఆరె కులస్తులను ఓబీసీ జాబితా లో చేర్చాలని గురువారం ఢిల్లీలోని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అధికారిక నివాసంలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశా రు. రాష్ట్రంలోని ఆరె కులస్తులను కేంద్ర ఓబీ సీ జాబితాలో చేర్చాలని కోరారు. ఆర్థికంగా వెనుకబడిన ఆరె కులస్తులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
సానుకూలంగా స్పం దించిన కేంద్ర మంత్రి సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖతో ఈ విషయమై చర్చిస్తామ ని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఆరె సంఘం ప్రతినిధులు గణపతి, డోకె దామోదర్, ఎలకరి దామోదర్, ఎల్ములే మల్లయ్య, సత్పుతే తుకారాం, లోనరే రవీందర్, డుబ్బుల వెంక న్న, భరత్ తదితరులు పాల్గొన్నారు.