22-01-2026 12:11:43 AM
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ,జనవరి 21(విజయక్రాంతి): వేములవాడ పట్టణంలో పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇల్లు పథకం అమలవుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.బుధవారం ఇస్లాం నగర్లో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.10 లక్షలతో శంకుస్థాపన చేయగా, మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మోడల్ ఇందిరమ్మ ఇల్లు ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
అనంతరం వేములవాడ రూరల్ మండల పరిధిలోని 29 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమమే లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక త్వంలో పేదలకు ఇళ్లు, రైతులకు భరోసా, మహిళలకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వందల కోట్లతో పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.