calender_icon.png 22 January, 2026 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో శారీరక దృఢత్వం

22-01-2026 12:12:43 AM

పటాన్ చెరు, జనవరి 21: పటాన్చెరు ని యోజకవర్గం పరిధిలో 36వ మైత్రి క్రికెట్ ట్రోఫీ పోటీలను పటాన్చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు స్నేహభావం, క్రమశిక్షణ పెరుగుతాయని పేర్కొన్నారు.

మైత్రి క్రికెట్ ట్రోఫీ వంటి క్రీడా పోటీలు సమాజంలో ఐ క్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పో షిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, క్లబ్ సభ్యులు యెల్లయ్య, అడ్డు, గిరి తదితరులు పాల్గొన్నారు.