27 May, 2026 | 1:42 AM

ఓటర్ జాబితాలో అనర్హులను తొలగించాలి

27-05-2026 12:47 AM

సీఈవో సుదర్శన్‌రెడ్డి 

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి) : భారత ఎన్నికల సంఘం రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్ ) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అలాగే అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం బీఆర్‌కే భవన్‌లో సీఈవో సుదర్శన్ రెడ్డి, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి, ఐఏఎస్, ఉప ప్రధాన ఎన్నికల అధికారి జీఎస్ చారిలతో కలిసి ప్రత్యేక సమగ్ర సవరణ  కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిష నర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మను చౌదరి, సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు హాజరయ్యారు. సర్ ప్రక్రియ నిర్వహ ణలో బూత్ స్థాయి అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నందున వారికి శిక్షణ ఇవ్వాలని ఈఆర్వోలకు సూచించారు. బీఎల్వోల పని విధానంపై నిరంతరం సమీక్షిస్తూ, మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.