17 April, 2026 | 8:28 PM

Breaking News

ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •   ఎర్రకుంట స్మశాన వాటికలో చెట్ల తొలగింపు   •  

శ్రీశైలానికి 41వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

31-05-2025 02:46 AM
  1. 42.27 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ 
  2. జూరాలకు కొనసాగుతున్న వరద

నాగర్‌కర్నూల్, మే 30 (విజయక్రాంతి): శ్రీశైలం జలాశయానికి మే నెలలోనే భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న ముందస్తు భారీ వర్షాల నేపథ్యంలో జూరాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. అధికారులు అప్రమత్తమై జూరాల ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. గురువారం 38.9150 టీఎంసీల నీరు నిల్వ ఉండగా సుంకేశుల నుంచి 4,345 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు నుంచి 37,082 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. దీంతో శుక్రవారం సాయంత్రానికి 821.90 అడుగుల వద్దకు చేరి 42.27 టీఎంసీలకు నీరు నిల్వ చేరింది.