15 June, 2026 | 11:37 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

సంకష్టహర చతుర్థి దీక్ష ఎంతో శ్రేష్టమైనది

05-02-2026 04:29 PM

ఘనంగా చతుర్థి వేడుకలు

సంకష్టహర చతుర్థి దీక్షతో సంకటాలు తొలుగుతాయి 

మంథని,(విజయక్రాంతి): ప్రతి నెలలో పౌర్ణమి తరువాత వచ్చే చవితి తిథిని సంకష్టహర చతుర్థిగా పరిగణిస్తారు. గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైనది చవితి తిథి.  మాఘ మాసం శుక్లపక్షం గురువారం రోజున సంకష్టహర చతుర్థి దీక్ష చేపట్టిన భక్తులకు రాత్రి 9.26 నిమిషములకు  చంద్రోదయం కాలం. చంద్రోదయ సమయమునకు చవితి తిథి ఉంటే సంకష్టహర చతుర్థి గా పరిగణిస్తారు.

మంథని పట్టణంలోని తమ్మిచెరువు కట్ట వీధిలో సిద్ధి బుద్ధి సమేతంగా వెలసిన శ్రీ మహాగణపతి దేవాలయంలో భక్తులు విశేష సంఖ్యలో విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు. ఈ రోజున గణపతి మహాగణపతి అనే నామంతో పూజలు అందుకున్నారు. మానవులు తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే సంకటాలను తొలగించుకోవడానికి ఈ దీక్ష చేపడతారు. ఏ శుభకార్యం చేయాలన్నా మొదట విగ్నేశ్వరున్ని పూజించడం మన సాంప్రదాయం. శ్రీ విఘ్నేశ్వరుని కృప ఉంటే ఇలాంటి కష్టములు దరి చేయవు. ఎలాంటి కష్టములైన తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.