13 July, 2026 | 9:50 PM

Breaking News

33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •  

మైథలాజికల్ టచ్‌తో దీక్ష

13-05-2025 12:00 AM

కిరణ్, ఆలేఖ్యరెడ్డి నాయకానాయి కలుగా నటిస్తున్న చిత్రం ‘దీక్ష’. ఆక్సాఖాన్, తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక,  రోహిత్‌శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతాని రామకృష్ణగౌడ్ దర్శకత్వం వహిస్తూ ఆర్‌కే ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై పీ అశోకుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. “మైథలాజికల్ టచ్‌ను రూపొందుతున్న ఈ చిత్రం మా బ్యానర్‌లో 41వ చిత్రమిది. దీని తర్వాత ‘కబడ్డీ’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాం”  అని చెప్పారు. హీరో కిరణ్, నటీనటులు ఆక్సాఖాన్, తులసి, రోహిత్‌శర్మ, మ్యూజిక్ డైరెక్టర్ రాజ్‌కిరణ్, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.