13-05-2025 12:00:00 AM
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్‌వీసీ) నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘తమ్ముడు’. ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమిగౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ అంటూ సినిమాలోని పాత్రల్ని పరిచయం చేశారు.
ఈ చిత్రంలోని ముఖ్యపాత్రలను, ఆ పాత్రల పేర్లనున రివీల్ చేస్తూ విడుదల చేసిన ఈ గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇందులో సప్తమి గౌడ రత్న అనే పాత్రలో, స్వసిక గుత్తి అనే కారెక్టర్‌లో కనిపించబోతోన్నారు. ఇక సౌరభ్ సచ్ దేవ్.. అగర్వాల్ పాత్రను పోషిస్తున్నారు. చిత్రగా వర్ష బొల్లమ్మ, ఝాన్సీ కిరణ్మయిగాలయ కనిపించబోతోన్నారు.
ఈ వీడియో ద్వారా కథను కూడా కొంత రివీల్ చేసినట్టు అనిపిస్తోంది. ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ చివర్లో నితిన్ ఎంట్రీ, బాణం వదిలిన తీరు అద్భుతంగా ఉంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్; సంగీతం: అజనీష్ లోకనాథ్; ఎడిటింగ్: ప్రవీణ్ పూడి.