12 July, 2026 | 4:47 AM

ఐపీఎల్‌కు పతీరానా దూరం!

06-05-2024 02:41 AM

చెన్నై: పంజాబ్‌పై విజయంతో జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కు షాక్ తగిలింది.  ఆ జట్టు ఆటగాడు మతీశా పతీరానా గాయంతో మిగతా టోర్నీకి దూరమైనట్లు సమాచారం. తొడ కండరాలు పట్టేయడంతో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు దూరమైన పతీరానా వీసా పనుల నిమిత్తం స్వదేశానికి వెళ్లి వచ్చాడు. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో తిరిగి శ్రీలంకకు వెళ్లిపోయినట్లు చెన్నై యాజమాన్యం ప్రకటించింది. అయితే గాయం నుంచి కోలుకున్నప్పటికి తిరిగి వస్తాడా రాడా అన్నది మాత్రం వెల్లడించలేదు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని లంక బోర్డు పతీరానాను తిరిగి ఐపీఎల్లో ఆడేందుకు అనుమతించకపోవచ్చు. ఇప్పటికే నిలకడగా రాణిస్తున్న ముస్తాఫిజుర్ కూడా బోర్డు పిలుపుతో స్వదేశానికి వెళ్లిపోవడం.. తాజాగా పతీరానా గాయం కారణంగా టోర్నీకి దూరం కానుండడం సీఎస్కేకు ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. కాగా పతీరానా ఈ సీజన్‌లో చెన్నై తరపున ఆరు మ్యాచ్‌ల్లోనే 13 వికెట్లు తీశాడు.