25 April, 2026 | 5:15 AM

కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇన్నారెడ్డి

09-12-2024 02:16 AM

* ప్రకటించిన సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ

హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రకటించారు. ఆదివారం రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిరుమల్‌రెడ్డి ఇన్నారెడ్డి పేరును ఖరారు చేసినట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 28 ఏండ్లుగా ఉపాధ్యాయవర్గానికి సేవలందించిన సీనియర్ ఉపాధ్యాయుడు ఇన్నారెడ్డిని ఎన్నికల బరిలో దింపుతున్నట్టు కార్యవర్గంలో తీర్మానించినట్టు పేర్కొన్నారు.

ఇటీవలే వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కే వెంకటస్వామిని ప్రకటిం చామని గుర్తుచేశారు. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకవైపు సీపీఎస్ అధ్యాపకుడిని, మరోవైపు పాత పెన్షనల్‌లో ఉన్న ఉపాధ్యాయున్ని అభ్యర్థులుగా ఉపాధ్యాయుల పక్షాన బరిలో దింపుతున్నట్టు చెప్పారు.