హెల్మెట్ వినియోగంపై వినూత్న ప్రచారం
మహబూబాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): హెల్మెట్ వినియోగం పై మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలీసులు వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. చిన్నతనం నుండే పిల్లలకు హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంపొందించడంతోపాటు గ్రామాల్లో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనానికి నో ఎంట్రీ చెప్పాలని ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా రామన్నగూడెం, కాచికల్, గ్రామల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నెల్లికుదురు ఎస్త్స్ర సిహెచ్ రమేష్ బాబు, గ్రామల్లో బైకు ఉన్న ప్రతి ఇంటింటికి తిరిగి ఏప్రిల్ 2 నుండి హెల్మెట్ వాడాలని బైక్ ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి కోరుతున్నారు. హెల్మెట్ లేనిదే గ్రామంలో ప్రవేశం లేదని అలాగే యువత గంజాయి, డ్రగ్స్,కి దూరంగా ఉండాలని ఒకవేళ ఒకవేళ డ్రగ్స్ వాడినట్లయితే వారికి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.




