10-12-2025 02:32:19 PM
పస్థల గ్రామంలో విద్యార్థుల వినూత ప్రదర్శన.. సెల్యూట్ చేస్తున్న గ్రామస్తులు
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామంలో చిన్నారులు చేసిన పనికి యూత్ ఫిదా అవుతున్నారు. జిల్లా ప్రజా పరిషత్ పసునూరు స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న రెంటాల జోయల్ "ఓట్లు అమ్మడం, కొనడం నేరం" అని ఇంటిముందు రాసి పెట్టాడు. స్కూల్ లో సోషల్ టీచర్ వెంకన్న ఇలా రాయమని చెప్పారని, చిన్నారులు అన్నారు. ఇది పది రోజుల క్రితమే ఏర్పాటు చేసినా, అది ఇప్పుడు ఎక్కువగా గ్రామంలో వైరల్ అయింది. ఏది ఏమైనా మారుతున్న సమాజంలో విద్యార్థులు ఏకంగా మార్పును కోరుకోవడం సమంజసమైన విషయమని అంటున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటర్లు తమ హక్కులను వినియోగించుకోవాలని చిన్నారుల ప్రార్థన.