10-12-2025 12:27:12 PM
దేశంలోనే మెదటి గూగుల్ స్టార్టప్స్ కేంద్రం
త్రీ ట్రిలియన్లపై విమర్శలు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో కొత్త గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన సందర్భంగా ఈ కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇదో కొత్త ప్రారంభం.. ఇదో కొత్త ప్రయాణం అన్నారు. స్టార్టప్స్ రంగంలో ఎన్నో అవకాశాలున్నాయని శ్రీధర్ బాబు సూచించారు.
మా స్టార్టప్ లకు గూగుల్ మెంటర్ గా ఉండటం చాలా సంతోషకరం అన్న ఐటీ మంత్రి ఇప్పుడు యూనికార్న్ సంస్థలకు ఏర్పాటు చేసే అవకాశం వచ్చిందన్నారు. యూనికార్న్ లను తయారు చేయడం కోసమే ఈ కేంద్ర ఉందన్నారు. త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకోవడంపై విమర్శలు వచ్చాయన్నారు. ఒక లక్ష్యం అంటూ ఉంటేనే ప్రగతి పథంలో దూసుకెళ్లగలం అన్నారు. కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలోని మొదటి ప్రైవేట్ రాకెట్ హైదరాబాద్ లోనే తయారైందని మంత్రి వివరించారు. టీహబ్ కు గూగుల్ ను రప్పించేందుకు చాలా శ్రమించామన్నారు. ఇది దేశంలోనే మొట్టమెదటి గూగుల్ స్టార్టప్స్ కేంద్ర అన్నారు. ఇది ప్రపంచంలోనే ఐదో గూగుల్ స్టార్టప్స్ కేంద్రమని మంత్రి వెల్లడించారు.