14-11-2025 01:29:39 AM
పాస్ కాకుంటే ఇంటికే
కరీంనగర్, నవంబర్13(విజయక్రాంతి):టెట్ నోటిఫికేషన్ వాతం లో వెలువడ నున్న నేపథ్యం లోపంతుళ్లకు ’టెట్’ టెన్షన్ పట్టుకుంది.ఐదేళ్లు పైబడి సర్వీసు ఉన్నవారు టెట్ పాస్ కావలసిందే అన ఎన్సీటీ తేల్చింది.రెండేళ్ల వ్యవధిలో ఉత్తీర్ణత కాకుంటే ఇంటికే అని నిర్ణయించడంతో ఉమ్మడి జిల్లలలో పంతుళ్ల అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు.
జిల్లాలో టెట్ లేనివారు 2,017 మంది ఉన్నారు.గతంలో టెట్ రాయకుం డా టీచర్లుగా ఎంపికైన వారు ఐదేళ్ల కన్నా ఎక్కువ సర్వీసులో ఉంటే కచ్చితంగా టెట్ రాయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విష యం తెలిసిందే. ఆ ఉత్తర్వులపై ఉపాధ్యాయులు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎ డ్యుకేషన్(ఎన్సీటీఈ)కి విన్నవించారు.
ఎన్సీటీఈ స్పందిస్తూ, టీచర్లు కచ్చితంగా సుప్రీం కోర్టుతీర్పు ప్రకారం నడుచుకోవాల్సిందేనని చెప్పడంతో ఉపాధ్యాయుల ఆశలు గల్లంతయ్యా యి. వృత్తిలో కొనసాగాలంటే చద వాల్సిందేనని, పుస్తకాలు కొని తెచ్చుకుని కుస్తీ పడుతున్నారు.2012కు ముందు ఉద్యోగాల్లో చేరినవారికి టెట్ అవసరం లేడని గతంలో హైకోర్టు చెప్పడంతో ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది.
ప్రభుత్వ ఉపాధ్యా యులుగా కొనసాగడానికి, పదోన్నతి పొందడానికి తప్పనిసరిగా టెట్ పేప ర్-2 ఉత్తీర్ణత కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో జిల్లాలోని గవర్నమెంట్, పంచాయతీరాజ్ టీచర్లు 2000 పైచిలుకు మంది ఆందోళనలో ఉన్నారు.ప్రభుత్వం రెండేళ్లవ్యవధిలో నాలుగుసార్లు ఉపా ధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహిస్తోంది. గతం లో ఆఫ్లై న్లో నిర్వహించగా, ప్రస్తుతం ఆన్లైన్ విధానా న్ని అనుసరిస్తోంది. ఆప్ లైన్ విధానంలో వేరే వారిని పెట్టి పరీక్ష రాయిస్తున్నారనే ఆరోపణల తో ఆన్లైన్ చేశారు.
ఆరు నెలలకు ఒక టెట్ చొప్పున నాలుగు టెట్లలో ఏదో ఒకదానిలో క్వాలిఫై కావాల్సి ఉంది. ఇది విద్యా ర్థుల పనితీరు మె రుగుదల, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకోవ డానికి ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది.ఆర్ టి ఈ యాక్ట్ 2009 అనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తూ ఏప్రిల్ 1,2010 నుండి అమలు లోకి తెస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సెక్షన్ 23 ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిం చడానికి కావలసిన అకాడమిక్ అర్హతలు, వృత్తిపరమైన అర్హతలు మరియు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా ఉత్తీర్ణుడై ఉండవలెనని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
ఇట్టి గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2010 కంటే ముందు నియామకం అయినవారికి టెట్ మినహాయింపు ఉంటుందని, ఆ తేదీ తర్వాత అనగా తర్వాత ఉపాధ్యాయ నియామకాలకు టెట్ పాస్ కావాలని స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.రెండేళ్లలో బెట్ క్వాలిఫై కానిపక్షం లో ఆ ఉపాధ్యాయులు సర్వీసులో కొనసాగే అవకా శం లేదు. ఉద్యోగ విరమణ లేదా టర్మినల్ బెనిఫి ట్స్ తీసుకుని ఉద్యోగం నుంచి వైదొలాగాల్సి ఉం టుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
-సీనియర్ ఉపాధ్యాయుల పాలిట గుదిబండగా మారిన టెట్
ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయు లు అందరూ విధిగా టెట్ ఉత్తీర్ణులై ఉండాలని సుప్రీంకోర్టు ఇ చ్చిన పిడుగు లాంటి తీర్పు ఉపాధ్యాయుల్లో గందరగోళాన్ని, ఆందోళన సృష్టించడం జరిగిందని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ (పిఆర్టియు టీజి) కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనె శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల్లో నెలకొన్న టెట్ ఆందోళన తొలగించాల్సిన బాధ్యత కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, ఆ దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశా రు.
పదవీ విరమణ ఇంకా ఐదు సంవత్సరాల పైబడి సర్వీస్ ఉన్నవారు అంద రూ రెండు సంవత్సరాల లోగా టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు తీర్పులో సూచించడం జరిగిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉపాధ్యాయులకు శరాగాతంగా పరిణమించడం జరి గిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత తీసుకొని ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు లభించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేయాలన్నారు.