27 June, 2026 | 2:36 AM

ఖైదీ మృతిపై విచారణ

14-06-2024 01:11 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లోని చంచల్ గూడ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ (నెం.9708)గా ఉన్న దేగావత్ కిషన్ ఫిబ్రవరి 13న అనుమానాస్పద స్థితిలో ఉస్మానియా ఆస్పత్రిలో మృతిచెందారు. ఆయన మృతిపై విచారణ జరపడానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌ను నియమించారు. ఈ ఘటనపై జూన్ 29న విచారణ జరుగుతుందని, మృతుడి బంధువులు, రక్త సంబంధీకులు కిషన్ మృతిపై ఏవైనా అనుమానాలుంటే తమకు తెలియజేయాలని స్పెషల్ మెజిస్ట్రేట్ కె.జ్యోతి ఓ ప్రకటనలో చెప్పారు. ఈ నెల 29న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లక్డీకాపూల్‌లోని కలెక్టరేట్‌కు రావాలని పేర్కొన్నారు.