27 June, 2026 | 3:45 AM

పకడ్బందీగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష

14-06-2024 01:10 AM

కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): ఈ నెల 16న జరగబోయే  సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు సూచించారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గల సరోజిని నాయు డు వనిత మహావిద్యాలయంలోని ఆడిటోరియంలో పరీక్ష నిర్వహణపై సూపర్‌వైజర్లు, రూట్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌లోని 99 కేంద్రాల్లో 45,153 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నట్లు చెప్పారు.    అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, యూపీఎస్సీ డిప్యూటీ సెక్రటరీ శైలేష్‌గౌతమ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, ఆర్డీవోలు పాల్గొన్నారు.