అభివృద్ధిలో అగ్రగామి పీర్జాదిగూడ
- దేశంలోని మెట్రో నగరాలతో పోటీ పడుతుంది
వెల్లడించిన కర్ణాటక 5వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ నారాయణ స్వామి
మేడిపల్లి, జూన్ 13 : దేశంలోని అత్యున్నత స్థాయి నగరాలతో పీర్జాదిగూడ పోటీ పడుతుందని, అభివృద్ధిలో అగ్రగామిగా వెలుగోందుతుందని కర్ణాటక 5వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ సి.నారాయణ స్వామి కొనియాడారు. పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థల ఆర్థిక స్థితిగతులు అంచనా వేసేందుకు కర్ణాటక ఐదవ ఫైనాన్స్ కమిషన్ బృందం సభ్యులు గురువారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పర్యటిం చారు. వీరికి మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, కమిషనర్ త్రిళేశ్వర్‌రావు పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం పవర్‌పాయింట్ ప్రజం టేషన్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్ర మాలను పరిశీలించారు. సమీకృత వైకుంఠధామం, మినీ ట్యాంక్‌బండ్, వ్యర్థ పదార్థాల శుద్ధీకరణ పార్కు, ఎఫ్‌ఎసీపీ, సెట్విన్ సెంటర్, ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్, బస్తీ దవాఖాన, తడి, పొడి చేస్తున్న పద్ధతుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చాయా చిత్రాలతో కూడిన కాఫీ టేబుల్ బుక్‌ను మేయర్ అందజేశారు. కమిషన్ సభ్యులు మొహమ్మద్ సనాహుల్లా, ఆర్.ఎస్.ఫోండే, వాహబ్‌ఖాన్, జాయింట్ సెక్రటరీ శర్మ, ఆర్‌ఓ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ బిక్షపతి, జేఏఓ సుమలత, టీపీఓ షేక్ అలీ పాషా తదితరులు పాల్గొన్నారు.






