20 March, 2026 | 6:12 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

వసూళ్ల కానిస్టేబుళ్లపై విచారణ

24-09-2024 01:40 AM

ఆదేశించిన ఎస్పీ గైక్వార్డ్

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఒంటరి జంటలనే టార్గెట్ చేస్తూ వారిని ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ వసూళ్లకు పాల్పడు తున్న బ్లూకోర్టు డయల్(100) డ్యూటీ కానిస్టేబుళ్లపై సోమవారం విజయక్రాంతి దినపత్రికలో ‘ఒంటరి జంటలే టార్గెట్’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి ఎస్పీ గైక్వా ర్డ్ వైభవ్ రఘునాథ్ స్పందించారు. సోమవా రం ఉదయం సెట్ కాన్ఫరెన్స్ ద్వారా ఘటనకు సంబందించిన వివరాలను అడిగి తె లుసుకున్నారు.

సమగ్రంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఎస్పీ బుర్రి శ్రీనివాసులును ఆదేశించారు. వార్తాకథనం లో వా స్తవాలు ఉన్నట్లు అంగీకరిస్తూనే అట్టివారిపై చర్యలకు రిపోర్టు సిద్ధం చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసు లు తెలిపారు. ఇంటలిజెన్స్ పోలీసు లు కూడా ఈ ఘటనపై ఆరా తీశారు. కా గా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ నే ఉన్నాయని అందుకు ఓ పోలీసు అధికారి అండగా ఉన్నారని విమర్శలొస్తున్నాయి.