calender_icon.png 14 February, 2026 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో తనిఖీ

14-02-2026 12:00:00 AM

సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ

శంషాబాద్, ఫిబ్రవరి 13: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి. సజ్జనార్, ఐపిఎస్ శుక్రవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లోని పోలీస్ అవుట్పోస్ట్ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ పనితీరును స్వయంగా పర్యవేక్షించిన ఆయన, రికార్డుల నిర్వహణ, కేసుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, భద్రతను మరింత కఠినం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

రికార్డుల పరిశీలన - క్షేత్రస్థాయి సమీక్ష

తనిఖీలో భాగంగా కమిషనర్  స్టేషన్లోని జనరల్ డైరీ, రిసెప్షన్ రిజిస్టర్లు, పెండింగ్లో ఉన్న పిటిషన్లు, విచారణలో ఉన్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి పిటిష్ప విచారణాధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని, బాధితులకు నిర్ణీత సమయంలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.

డ్రగ్స్ నియంత్రణ..

విమానాశ్రయం ద్వారా మాదకద్రవ్యాల సరఫరా జరగకుండా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకోవాలని తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగలు, పాత నేరస్తుల పూర్తి వివరాలతో కూడిన డేటాబేస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ, వారి కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రయా ణికులకు తక్షణ సహాయం అందించేందుకు విమానాశ్రయ అరైవల్ ఏరియాలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన కేసుల దర్యాప్తు వేగవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్ట్ ఎన్‌హెచ్‌ఓల (SHOs) కాంటాక్ట్ వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ శ్రీ బి. రాజేష్, ఏసిపి శ్రీ శ్రీకాంత్ గౌడ్, ఇన్ స్పెక్టర్ శ్రీ కనకయ్య సంపతి మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.