1 May, 2026 | 4:08 AM

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ

01-05-2026 02:36 AM

నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మండలంలోని ఐకెపి ఆధ్వర్యంలో బంజారా తండా, పోచారం, ఆబెద్ నగర్, గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తాసిల్దార్ బిక్షపతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ బిక్షపతి వరి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సమయాన్నిసారం తూకం వేస్తున్నారా, హమాలి కూలీలు, లారీలు, గోనె సంచుల సమస్యల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.

వరి ధాన్యం తూకం చేయడం వేగవంతం చేయాలని తెలిపారు.ఏమైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద హామాలి కూలీల కోసం, రైతుల కోసం నీడ,నీటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఐకెపి సెంటర్ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి సీసీ నారాయణ, వివోఏలు తదితరులు పాల్గొన్నారు.