19 August, 2026 | 10:21 AM

సోనాలలో కమ్యూనిటీ కాంట్రాక్ట్

19-08-2026 09:40 AM

232 ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు ,రెండు కార్లు స్వాధీనం. 

బోథ్, (విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని చేపట్టారు.  150 మంది పోలీసులతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో నంబర్ ప్లేట్ లేని ఒక కారు, స్వాధీనం చేసుకోవడం జరిగిందని స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ఎన్. వెంకట నరసయ్య పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు. పనికిసందర్భంగా ఒక వంద యాభై మంది పోలీస్ అధికారులు పోలీసు సిబ్బంది పాల్గొనడం జరిగిందని ఆయన తెలిపారు.

అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ఆయన పేర్కొన్నారు. పిడిఎస్ బియ్యం కొనుగోలు చేసిన విక్రయించిన నేరమని హెచ్చరించారు. గంజాయి నిలువ ఉంచడం సేవించడం చట్టరీత్యా నేరమని వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు తనిఖీలలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు నిందితులవద్ద మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి కమతం ఇంద్రవర్ధన్ సిఐలు సిహెచ్ రమేష్, బి ప్రణయ్ కుమార్, రిజర్వుడ్ ఇన్స్పెక్టర్లు బి వెంకటి టీ మురళి ఎం చంద్రశేఖర్ ఎస్సైలు వి పురుషోత్తం, రమేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.