19 August, 2026 | 10:22 AM

అమృత్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

19-08-2026 09:33 AM

మోతె, ఆగస్టు 19(విజయక్రాంతి) :- మండల పరిధిలోని కొత్త గూడెం గ్రామంలో అమృత్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన  అనంతరం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ, యువత స్వశక్తి పై ఆధార పడి జీవించాలని కోరారు. మండలంలోని కొత్త గూడెం గ్రామంలో యువత కు ఆదర్శంగా నిలిచే విధంగా గజ్జల శ్యామల మధుసూదన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం జిల్లా లోని ప్రతి ఒక్కరికి ఆదర్శం గా నిలుస్తుందని చెప్పారు. సుమారు ఆరు కోట్ల విలువతో నిర్మించిన ఈ ప్రాజెక్టు దిన దినం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రోజు కు సుమారు ఒక లక్ష లీటర్లు పంపు చేయడం జరుగుతుందని, ఒక స్విఫ్ట్ కు పది హేనుమంది రెండు స్విఫ్ట్ లకు 30 మందితో ఈ ప్లాంటు ను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం లో ప్లాంట్ నిర్వాహకులు గజ్జల శ్యామల మధుసూదన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, మాజీ జడ్పిటిసి పుల్లారావు, సర్పంచ్ శేషి రెడ్డి, మామిళ్ళ గూడెం సర్పంచ్ నాగమణి వీరాస్వామి, మాజీ సర్పంచ్ యల్లయ్య, మామిడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.