పంపుహౌస్ ట్రాన్స్‌ఫార్మర్‌ల పరిశీలన
14-08-2026 12:03 AM
చిన్నంబావి, ఆగస్టు 12: మండల పరిధిలోని చిన్నమారూర్ ఎత్తిపోతల పథకం ఫేజ్ 1, 2లోని ట్రాన్స్ ఫార్మర్ లను గురువారం జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ తాతరావు, ఏడి శ్రీనివాస్, డీఈ శ్రీనివాస్ లు ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం ఎస్‌ఈ మాట్లాడుతూ పంపుహౌస్ ఫేజ్ 1 లోని ట్రాన్స్ ఫార్మర్ ఎలాంటి లోపం లేదని, ఫేజ్ 2లోని ట్రాన్స్ ఫార్మర్ సక్రమంగా పనిచేయడం లేదని వాటి స్థానంలో 1000 కేవిఎ సామర్థ్యం ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఏఈ అప్పలనాయుడు,లైన్ మెన్ ఈశ్వరయ్య, కాంగ్రెస్ నాయకులు కళ్యాణ్ కుమార్,శివ మల్లయ్య,మోహన్,హనుమంతు రావు,గంగారి శ్రీను,మద్దిలేటి,నరేశ్ తదితరులు పాల్గొన్నారు.






