28 June, 2026 | 2:12 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

టైర్‌పేలి కూల్ డ్రింక్స్ వాహనం బోల్తా..

11-05-2026 01:09 AM

డ్రైవర్‌కు గాయాలు

మద్నూర్, మే 10 (విజయక్రాంతి); కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం నుండి బిచ్కుంద కు వెళ్తున్న స్ప్రుటై, థమ్సప్(కూల్ డ్రింక్స్) వాహనం ఆదివారం టైరు పేలి లారీ బోల్తా పడింది , లారీ లో తరలిస్తున్న కూల్ డ్రింక్స్ 161 వ జాతీయ రహదారిపై  చెల్లా చెదరుగా పడిపోయాయి. కూల్ డ్రింక్స్ బాటిల్స్ చాలావరకు ధ్వంసమయ్యాయి.

ఈ ఘటన మద్నూర్ మండలం రుషి గావ్ చౌరస్తా వద్ద161వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.  బోల్తా పడిన వాహనాన్ని పక్కకు తరలించారు. అనంతరం కూల్ డ్రింక్స్ ఏజెన్సీ యాజమాన్యం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.