8 July, 2026 | 2:03 AM

వై.టి.పి.ఎస్‌లోని వైద్యశిబిరం పరిశీలన

08-07-2026 01:36 AM

దామరచర్ల,జులై :7దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని డీఎంహెచ్వో రాహుల్, నల్గొండ డి ఎం ఓ డా. నాగేశ్తో కలిసి మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా సీజ నల్ వ్యాధుల నివారణ, నియంత్రణ కోసం చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు.

శిబిరం లో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలిం చి, వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం, ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని అధికారుల కు సూచించారు.ఈ కార్యక్రమం లో వైద్యాధికారి డా. నాగేశ్వరరావు , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.