ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు
20-06-2026 12:38 AM
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూన్ 19 (విజయక్రాంతి): జిల్లాలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మూడు రోజులుగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ ,డాక్టర్ శ్రీదేవి ,డాక్టర్ దేవేందర్, శ్రీదేవి తనిఖీలు చేపట్టారు. శుక్రవారం కిరణ్ హాస్పిటల్, యోదా హాస్పిటల్, మేద హాస్పిటల్, స్మార్ట్ కేర్, శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్, ప్రధాన్ హాస్పిటల్ లో తనిఖీలు నిర్వహించారు. హాస్పటల్లో ఫైర్, పొల్యూషన్ బయోమెడికల్, ధరల పట్టిక మొదలగునవి తనిఖీ చేశారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ జిల్లాలో 44 ఆసుపత్రులు రిజిస్టర్ అయి ఉన్నాయని, అన్ని ఆసుపత్రులు విధిగా తనిఖీలు నిర్వహిస్తామని తెలియజేశారు.






