20 June, 2026 | 2:38 AM

రెవెన్యూ అధికారులపై మహిళ దాడి

20-06-2026 12:38 AM

ఇబ్రహీంపట్నం, జూన్ 19 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్‌లో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఓ మహిళ దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో అధికారులు పోలీసులను ఆశ్రయించారు. తుర్కయంజాల్ పరిధి లోని సర్వే నంబర్ 338లో ఉన్న 1810 గజా ల భూమిపై కొంతకాలంగా వివాదం నడు స్తోంది.

దీనిపై ఆదిభట్ల పోలీసుల నుంచి వచ్చిన నివేదికను పరిశీలించిన ఆర్డీవో సదరు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్‌ఐ ప్రేమ్‌కుమార్, జీపీఓ హనుమంతు సిబ్బందితో కలిసి శుక్రవారం అక్కడికి వచ్చారు. ఆ స్థలం వద్ద ఉన్న ఓ మహిళ అధికారులకు అడ్డు తగిలింది. ‘మీరు ఎవరో నాకు తెలియదు, మీరే నిజమైన అధికారులని నమ్మకం ఏమిటి?’ అంటూ వాగ్వాదానికి దిగింది. పరిస్థితి అదుపు తప్పడం తో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.