calender_icon.png 10 January, 2026 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫర్టిలైజర్ షాపుల తనిఖీలు

06-01-2026 12:04:03 AM

గోపాలపేట, జనవరి 5 : వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రేషన్ షాపులను ఆకస్మికతనికి చేశారు. గోపాలపేట మండలం మున్ననూరు గ్రామంలో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారి కరుణశ్రీ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కరుణ శ్రీ మాట్లాడుతూ. మండలంలో ఉన్న ప్రతి డీలర్ షాప్ యజమానులు తప్పకుండా రిజిస్టర్ రాయాలని చెప్పారు.

అంతేకాకుండా ఫర్టిలైజర్ దుకాణాలలో రైతులకు కావలసిన ఎరువులను సిద్ధం చేయడమే కాకుండా నాణ్యమైన ఎరువులు విక్రయించాలన్నారు ముఖ్యంగా ఎరువులు విక్రయించినప్పుడు రైతుకు తప్పకుండా రసీదు చెల్లించాలన్నారు.  డీలర్ అయినా కల్తీ ఎరువులు విక్రయిస్తే తన లైసెన్సును రద్దు చేయడమే కాకుండా అతనిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలోవ్యవసాయ అధికారి కరుణశ్రీ, ఏఈఓ  నాగరాజు మరియు రైతులు పాల్గొనడం జరిగింది.